Latest Navel Updates

Monday 17 June 2013

బాలీవుడ్ లో చాన్స్ కొట్టేసిన లారెన్స్ !

Raghava Lwarence


బాలీవుడ్ లో చాన్స్ కొట్టేసిన లారెన్స్ !

 లారెన్స్ హీరోగా , దర్శకుడిగా తెరకెక్కించిన ‘కాంచన’ సినిమా రీమేక్ హక్కులని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీల భన్సాలి మంచి ధరకి కొనుగోలు చేశారు. ఈ సినిమాని హిందీలో కూడా షూట్ చేయబోతున్నారు. హిందీలో నిర్మించపోతున్న ఈ సినిమాకి లారెన్స్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఆంద్ర ప్రదేశ్ లో హిట్ సాదించిన ‘కాంచన’ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ కు చాలా డబ్భును సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో లారెన్స్ సరసన లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా నటించింది. హిందీలో ఈ సినిమాలో ఎవరెవరు నటించాబోతున్నరన్నది త్వరలో తెలియజేస్తాం. ప్రస్తుతం లారెన్స్ ‘ముని 3′ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి సారిగా లారెన్స్ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు. 


Tags: Telugu Cinema News, Telugu Movie News, Tollywood

No comments:

Post a Comment