Latest Navel Updates

Monday 17 June 2013

'పోటుగాడు'గా మంచు మనోజ్....



Manchu Manoj

'పోటుగాడు'గా మంచు మనోజ్..


మంచు మనోజ్ హీరోగా పవన్ వడయార్ దర్శకత్వంలో లగడపాటి శిరీష అండ్ శ్రీధర్ రూపొందిస్తున్న చిత్రం పోటుగాడు. ఈ చిత్రం యొక్క టీజర్‌ను నిర్మాతలు ఇటీవలే విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ చూస్తుంటే మనోజ్ ఇంకా తన వేషాలు మార్చుకోడా అన్నట్టు ఉంది. 

ఎందుకంటే తన సినిమాలల్లో రకరకాల ప్రయోగాలు చేసిన మనోజ్ మరోసారి ఈ చిత్రంలో కూడా సరికొత్త ప్రయోగాలు చేసినట్లుగా టీజర్ చూస్తే ఇట్టే తెలుస్తోంది. అంతకుముందు మిస్టర్ నూకయ్యలో కూడా మనోజ్ రకరకాల గెటప్స్ వేసి నిరాశపరిచాడు. అదే తరహాలో మరోసారి మనోజ్ రకరకాలుగా ఈ టీజర్లో దర్శనమిచ్చాడు. 

ఈ సినిమా గురించి మనోజ్ మాట్లాడుతూ 'ఓ కన్నడ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నాను. ఓ సారి చూడు అని శ్రీధర్ చెబితే ఈ సినిమా చూశాను. వండర్ అనిపించింది. అయితే కన్నడ దర్శకునితోనే తీస్తే కథకు న్యాయం జరుగుతుందని చెప్పాను. వెంటనే పవన్‌ని తెప్పించారు శ్రీధర్. 48 రోజుల్లో ఈ చిత్రం పూర్తయిందంటే దానికి కారణం చిత్రం యూనిట్టే. ఈ వారంలోనే పాటలను విడుదల చేస్తాం' అని తెలిపారు.

Tags: Telugu Movie News, Telugu Cinema News, Tollywood

No comments:

Post a Comment