Latest Navel Updates

Tuesday 18 June 2013

కన్న కూతురుని వ్యభిచారం లోకి దింపాలని చూసిన తల్లి , తండ్రులపై కూతురి ఫిర్యాదు !


కన్న కూతురుని వ్యభిచారం లోకి దింపాలని చూసిన తల్లి , తండ్రులపై కూతురి ఫిర్యాదు ! 

లోకం మారింది, డబ్బుకోసం అలంటి పనైనా చేయటానికి మనుషులు వెనుకాడటం లేదు . కన్న కూతురిని వ్యభిచారం చేయమని తల్లి , తండ్రులే బలవంతం పెడుతుంటే , వారి చేతిలో గాయ పడిన ఆ పిల్ల వారి నుంచి తప్పిచుకుని ఓ స్వచ్చంద సంస్థ ద్వారా పోలిసుల వద్ద బోరున విలపిస్తూ తల్లి , తండ్రుల ఫై పిర్యాదు చేసింది . 

 మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణంలోని నల్లపోచమ్మ నగర్‌లో నివాసం ఉండే ఆరె విజయ, ఆరె ప్రవీణ్ అనే దంపతులు కొన్నాళ్లుగా వ్యభిచారం చేయాలంటూ తమ కన్నబిడ్డపై ఒత్తిడి తెస్తూ చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో బాధితురాలు ఇంటి నుంచి వెళ్లిపోయి హైదరాబాద్‌లోని ఓ వసతి గృహంలో తలదాచుకుంది.

అక్కడ నుంచి ప్రజ్వల ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఆశ్రయించింది. వారి సహకారంతో ఈ నెల 15న సిద్ధిపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం బాధితురాలి తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags: Telugu News, AP News, News

No comments:

Post a Comment