Latest Navel Updates

Showing posts with label Telugu News. Show all posts
Showing posts with label Telugu News. Show all posts

Thursday, 11 July 2013

వంటల పుస్తకాన్ని రాస్తా! బాలీవుడ్ నటి పూజా బాత్రా


న్యూఢిల్లీ: కథానాయికగా కాస్త డిమాండ్ తగ్గాక పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఏదో వ్యాపారాన్ని ప్రారంభించడం బాలీవుడ్‌లో సాధారణమే. రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకున్న తర్వాత శిల్పాశెట్టి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫ్రాంచైజీల్లో ఒకరిగా కొనసాగుతూ వ్యాపారం చేసింది. అంతేనా యోగా పాఠాలతో ఓ వీడియో ఆల్బమ్‌ను రూపొందించి మార్కెట్‌లోకి వదిలి కాస్తోకూస్తో సొమ్ము చేసుకుంది. ఇక శ్రీదేవి, మాధురీ, ప్రీతిజింతా ఇలా ఒకప్పటి పేరుమోసిన కథానాయికలు సినిమాల తర్వాత ఏదో ఒకటి చేస్తూ డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేసినవారే. ఇప్పుడు వారి మార్గంలోనే నడిచే ప్రయత్నం చేస్తోంది మరో బాలీవుడ్ నటి పూజా బాత్రా.

అయితే అందరిలాగా టీవీ షోలు, వీడియో ఆల్బమ్‌లు చేయడం వంటివి కాకుండా కాస్త భిన్నంగా ఆలోచిస్తోంది. ఓ పుస్తకాన్ని రాసి, మార్కెట్‌లోకి వదలాలనుకుంటోంది. అది అలాంటి ఇలాంటి పుస్తకం కాదు... తనకు పాకశాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉండడంతో దానిమీదే ఓ పుస్తకాన్ని రాయాలని పూజా డిసైడైంది. ముంబైలో పదహారేళ్ల బాలిక రాసిన ‘వన్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన పూజా తన మనసులోని మాట కూడా బయటపెట్టింది. మీరు కూడా ఏదైనా పుస్తకం రాసే ఆలోచనలో ఉన్నారా? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘తప్పకుండా రాస్తాను. అయితే అది కాల్పనిక కథలతో కూడిన పుస్తకమైనా కావొచ్చు, రొమాంటిక్ థ్రిల్లర్ కావొచ్చు.

ఈ రెండు కాకపోయినా నాకు వంటలు చేయడం బాగా వచ్చు కాబట్టి ఓ వంటల పుస్తకాన్ని రాయాలనే ఆలోచనలో కూడా ఉన్నాన’ని చెప్పింది. విశ్వవిధాతా, విరాసత్, హసీనా మాన్ జాయేగీ, కహీ ప్యార్ న హోజాయే, నాయక్, కుచ్ ఖట్టీ కుచ్ మీఠీ వంటి చిత్రాల్లో నటించి, 2002లో ఆర్థోపెడిక్ సర్జన్ సోనూ అహ్లూవాలియాను వివాహమాడి అమెరికాకు వెళ్లిపోయింది. 2011లో సోనూ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్‌ను ప్రారంభించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘లా తో వెగాస్’, ‘స్పిరిట్ ఆఫ్ ముంబై’ రెండు చిత్రాలున్నాయిf

చాలా విచిత్రమైన పరిస్థితి నాది తాప్సీ

తాప్సీ ఇప్పుడు ఫుల్ బిజీ. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ విజయాన్ని కూడా ఆస్వాదించలేనంత బిజీ అన్నమాట. హిందీలో ఆమె నటించిన తొలి చిత్రం ‘చష్మే బద్దూర్’ ఇటీవలే విడుదలయ్యింది. హిట్ టాక్ కూడా తెచ్చుకుంది.

బాలీవుడ్‌వారి అభినందనలను అందుకుంటూ సినిమా విజయవంతంగా సాగుతోంది. కానీ, ఆ అభినందనలను వినే తీరిక కూడా తాప్సీకి లేదు. ఎందుకంటే షూటింగ్స్‌తో బిజీ. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ - ‘‘ఈ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. మనం చేసే పని తాలూకు విజయాన్ని ఆస్వాదించలేనంత బిజీగా ఉండటం ఆనందంగానే ఉంటుంది.

కానీ నలుగురూ మెచ్చుకున్నప్పుడు స్వయంగా వినాలని ఉంటుంది కదా’’ అన్నారు. బాలీవుడ్‌లో తొలి అడుగు విజయవంతమైంది. మరి... మలి అడుగు ఖరారయ్యిందా? అనే ప్రశ్న తాప్సీ ముందుంచితే -‘‘హిందీలో మరో సినిమాకి సైన్ చేశాను. ఈ ఏడాది చివర్లో అది ప్రారంభమవుతుంది. నాలానే హిందీ పరిశ్రమకు కొతై్తన ఓ యువ హీరోతో ఈ సినిమా చేయబోతున్నా. ఈ అడుగు కూడా మంచిదే అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

విజయ తీరంలో సిరిమల్లె పువ్వు

‘‘నేను ఆశించిన స్థాయిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సిరిమల్లె పువ్వు విజయ తీరాన్ని చేరుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సహకరించిన శ్రీనివాస్‌రెడ్డి, ఉమాదేవి, శ్రీధర్‌రెడ్డి, మల్టీడైమన్షన్ వాసుకి కృతజ్ఞతలు.’’ అని దర్శకుడు రామరాజు చెప్పారు. క్రాంతి, శ్రీ దివ్య జంటగా జక్కం జవహర్‌బాబు సమర్పణలో జి.ఉమాదేవి నిర్మించిన ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో శ్రీ దివ్య మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని టచ్ చేసింది’’ అని సంతోషం వెలిబుచ్చారు. కథను నమ్మి సినిమా చేసినందుకు మంచి ఫలితం దక్కిందని క్రాంతి చెప్పారు. సంగీత దర్శకుడు పవన్‌కుమార్, కెమెరామేన్ బాల్‌రెడ్డి కూడా మాట్లాడారు.

‘పెళ్లి పుస్తకం’ పెళ్లయిన తర్వాత...



‘‘మా చిత్రానికీ బాపుగారి సినిమాకీ ఎలాంటి పోలిక ఉండదు. పెళ్లయిన తర్వాత ఓ జంట ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? అనేది ఈ సినిమా ప్రధానాంశం. ఈ పాయింట్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని బి.నాగిరెడ్డి అన్నారు. బి.వి. గోపాల్, పి.సుమన్‌తో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘పెళ్లి పుస్తకం’. రాహుల్, నీతిటేలర్ జంటగా రామకృష్ణ మచ్చకంటి దర్శకత్వం వహించారు. రేపు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ -‘‘ఈ వర్షాకాలంలో అందరూ హాయిగా ఆస్వాదించదగ్గ సినిమా ఇది. నా కెరీర్‌కి మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. మంచి పాత్రలు చేశామని అనిల్ కల్యాణ్, యశస్విని అన్నారు. -

పవన్‌కల్యాణ్ రేవ్ పార్టీ -ద్రాక్ష తోటల్లో పవన్‌ కళ్యాణ్ సందడి


ఇప్పటి కుర్రకారుకి రేవ్‌పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రేవ్ పార్టీ పేరు చెప్పి వాళ్లు చేసే ఎంజాయ్ అంతా ఇంతా కాదు. ఈ ఎంజాయ్‌మెంట్ జాబితాలో పవన్‌కల్యాణ్ కూడా చేరిపోయారు. సమంత, ముంతాజ్, హంసానందిని తదితరులతో కలిసి ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ’ అంటూ పవన్‌కల్యాణ్ రేవ్ పార్టీ జరుపుకుంటున్నారు.

అయితే అది నిజం పార్టీ అనుకునేరు. ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం రేవ్‌పార్టీ సెటప్‌తో ఓ పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ‘జల్సా’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై బీవీయస్‌యన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా పాటలను వచ్చే వారం విడుదల చేయబోతున్నారు. సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మేం ఇప్పటి వరకూ టైటిల్ ప్రకటించకపోయినా, ‘అత్తారింటికి దారేది’ బాగా ప్రచారమైపోయింది. మా కథకు హండ్రడ్ పర్సంట్ యాప్ట్ అది.

అందుకే అధికారికంగా అదే ప్రకటిస్తున్నాం. గత నెలలో స్పెయిన్‌లో 25 రోజుల పాటు భారీ షెడ్యూలు చేసొచ్చాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో గణేష్ నృత్య దర్శకత్వంలో భారీ ఎత్తున రేవ్ పార్టీ నేప థ్యంలో పాట చిత్రీకరిస్తున్నాం. ఇందులో పవర్‌స్టార్ స్టెప్స్ అదిరిపోతాయి. దేవిశ్రీప్రసాద్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సహనిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

Tuesday, 2 July 2013

ఈ-ఆధార్..గుర్తింపు, చిరునామా ధ్రువపత్రంగా ఉపయోగించుకోవచ్చు!

ఈ-ఆధార్..గుర్తింపు, చిరునామా ధ్రువపత్రంగా ఉపయోగించుకోవచ్చు. ‘డిజిటల్ సిగ్నేచర్ ఉండే ఎలక్ట్రానిక్ రికార్డులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 చట్టబద్ధత కల్పిస్తోంది. కాబట్టి ఈ-ఆధార్ కూడా చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే పత్రమే. దానిపైనా డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది’ అని పేర్కొంది. పోస్టులో వచ్చే ఆధార్ పత్రంలో ఉన్న వివరాలే ఈ-ఆధార్‌లోనూ ఉంటాయని పేర్కొంది. పౌరులు యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించింది. పోస్టులో ఇంటికొచ్చే ఆధార్ లెటర్ నుంచి కత్తిరించి విడిగా తీయడానికి వీలున్న భాగాన్ని కొందరు గుర్తింపు పత్రంగా అంగీకరించడం లేదంటూ తమకు ఫిర్యాదులు వస్తున్నాయని యూఐడీఏఐ తెలిపింది. అయితే అందులో ఫొటోతో పాటు పేరు, చిరునామా, ఆధార్ నంబర్ అన్నీ ఉంటాయని, కాబట్టి అది చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే పత్రమని స్పష్టంచేసింది. 

Tags: Telugu News, Andhra News, News

బ్రహ్మానందం 'యంగ్ ఇన్ హార్ట్' అంటున్న శ్రుతి హాసన్ !

 బ్రహ్మానందం గారి నుంచి చాలా నేర్చుకున్నా. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయనతో చాలా సన్నివేశాలు చేశాను. ఆయన 'యంగ్ ఇన్ హార్ట్'. నా కోసం వారింటి నుంచి భోజనం పంపించారు. ఆయన భార్య వంటకం చాలా రుచిగా ఉంది. వారి ఆత్మీయతను మర్చిపోలేను.

Tags: Telugu Cinema News, Telugu Movie, Film News

తెలుగు లో బిజీగా ఉన్న శ్రుతి హాసన్ !

సినిమా కెరీర్ తోలి చిత్రాలు సక్సస్ లేక ఐరన్ లెగ్ గా ఉంది అనుకున్న శ్రుతి హాసన్, ఇప్పుడు తెలుగు లో చాల చిత్రాల  తో బిజీ గా ఉంది . తను హిరోయిన్ గా నటించిన గబ్బర్ సింగ్ , బలుపు సినిమాలు మంచి సక్సస్ సాధించిన విషయం తెలిసిందే . ఇంకా ఆమె నటిస్తున్న చిత్రాలు తెలుగు, హిందీ భాషల్లో 'రామయ్యా వస్తావయ్యా' పేరుతో రూపొందుతున్న, రెండు వేర్వేరు కథలతో తయారవుతున్న సినిమాల్లో నటిస్తుండటం వింత అనుభూతి అని ఆమె చెపుతుంది . ఇది యాదృచ్ఛికం. తెలుగు సినిమాలో ఎన్టీఆర్ సరసనా, హిందీ సినిమాలో గిరీశ్‌కుమార్ సరసనా చేస్తున్నా. రామ్‌చరణ్‌తో 'ఎవడు'లో పక్కింటమ్మాయి తరహా చక్కని పాత్ర చేస్తున్నా. నా అభిమాన సహ నటుల్లో రామ్‌చరణ్ ఒకరు. అల్లు అర్జున్ సరసన 'రేసు గుర్రం'లో నటిస్తున్నా. బాలీవుడ్ సినిమా 'డి-డే'లో నాది బోల్డ్ కేరక్టరే. నాన్న, అమ్మ కూడా తమ జీవితాల్లో 'బోల్డ్ డెసిషన్స్' తీసుకున్న వాళ్లే. ఆ సినిమాలో నాది క్లిష్టమైన, ఉత్తేజవంతమైన, బలమైన పాత్ర. నాకు పేరు తెస్తుందని ఆశిస్తున్నానని శ్రుతి హాసన్ చెపుతుంది.  

Tags: Telugu Cinema News, Telugu Movies, Film News

రవితేజ అమేజింగ్ కో-స్టార్ - శ్రుతి హాసన్

రవితేజ అమేజింగ్ కో-స్టార్. ఆయనతో పనిచేయడానికి ఆస్వాదించా. బ్రహ్మానందం గారి నుంచి చాలా నేర్చుకున్నా. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయనతో చాలా సన్నివేశాలు చేశాను. ఆయన 'యంగ్ ఇన్ హార్ట్'. నా కోసం వారింటి నుంచి భోజనం పంపించారు. ఆయన భార్య వంటకం చాలా రుచిగా ఉంది. వారి ఆత్మీయతను మర్చిపోలేను.

Tags: Telugu Cinema News, Telugu Movies, Film News

రుద్రమదేవి లో అనుష్క కి 5 కోట్ల వజ్రాభరణాలు !

గుణా టీమ్ వర్క్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క నాయిక. దర్శకనిర్మాత గుణశేఖర్ చిత్ర విశేషాలను వెల్లడిస్తూ "తొలి షెడ్యూల్‌తో 35 శాతం పూర్తయింది. ఐమాక్స్ త్రీడీ థియేటర్‌లో ఫస్ట్ షెడ్యూల్ రష్‌ను నా టీమ్‌తో పాటు చూశాను. సంతృప్తికరంగా అనిపించింది. రుద్రమదేవిగా నటిస్తున్న అనుష్క ఈ చిత్రంలో బంగారంలో వజ్రాలు పొదిగిన నిజమైన ఆభరణాలను ధరించింది.  వాటి విలువ రూ.5 కోట్లు. నీతాలుల్లా డిజైన్ చేశారు. 'జోధా అక్బర్'నగల రేంజ్‌లో ఈ సినిమాలోని నగలు కూడా ప్రాచుర్యం పొందుతాయన్న నమ్మకం ఉంది. రెండో షెడ్యూల్‌ను జూలై 3నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్ ఏకర్స్‌లో వేసిన వెయ్యి స్తంభాల గుడిలో చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల్ని, ఓ పాటని తెరకెక్కిస్తాం. డిసెంబర్‌కు చిత్రీకరణ పూర్తవుతుంది. సుమన్ విలన్‌గా నటిస్తున్నారు'' అని అన్నారు.

సుమన్ మాట్లాడుతూ "తమిళంలో విలన్‌గా చేశానుగానీ తెలుగులో చేయడం ఇదే తొలిసారి. తొలి ఇండియన్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడీ 'రుద్రమదేవి'లో హరిహరదేవుడు పాత్రలో నటించడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు. రానా, కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, జారా షా, నథాలియా కౌర్ తదితరులు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్

Tags: Telugu Cinema News, Telugu Movies, Film News

తెలంగాణ ఫై అసెంబ్లీ లో తీర్మానం వీగిపోతుంది - లగడపాటి

 స్థానిక ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం పెడితే వీగిపోవడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతతూ దీనికి సంబంధించి తీర్మానం వీగిపోయేలా ప్రయత్నిస్తామన్నారు. అందరు కలిసి తెలుగుతల్లిని బలిపిఠం ఎక్కించారని ఆయన వాపోయారు. టీడీపీ ఇచ్చిన లేఖతోనే కేంద్రంపై ఒత్తిడి పెరిగిందన్నారు.
 టిడిపి నేతలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నందువల్ల, ఆ పార్టీ విభజనకు అనుకూలంగా లేఖను ఇచ్చినందువల్లనే కేంద్రం తెలంగాణ వైపు మొగ్గుతుందని లగడపాటి ఆరోపించారు. కేంద్రం తెలుగు తల్లిని చీల్చుతుందా? లేక అలాగే ఉంచుతుందా? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారు.
కాంగ్రెసు పార్టీ ఎంపీలు, నేతల్లో చాలామంది విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విభజన భారాన్ని కేంద్రంపై వేసిందన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
శ్రమిస్తున్నాయని  లగడపాటి చెప్పారు. ఈ సమస్య పరిష్కారంపై అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ మూడేళ్లలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని గతంలోనే చెప్పామని కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం వద్దన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెట్టినా వీగిపోవడం ఖాయమన్నారు.

Tags: Telugu News, Andhra News, News

వై యస్ అర్ CP లో చేరనున్న మోపిదేవి వేంకట రమణ !

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపీదేవి వెంకటరమణ వైపీసీ తీర్థం పుచ్చుకోనున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలియవచ్చింది. మోపిదేవి బెయిల్ కోసం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరుగుతోంది. ఒక వేళ బెయిల్ రాని పక్షంలో బుధవారం చంచల్‌గూడ జైల్లోనే జగన్ సమక్షంలో మోపిదేవి వైసీపీ ఖండువా వేసుకోనున్నారు.
గురువారంనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో మోపిదేవి భార్య, సోదరుడు, ఆయన వర్గీయులు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా మోపిదేవి వెంకటరమణను అనారోగ్యం కారణంగా మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మోపిదేవి వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

Tags: Telugu News, Andhra News, News

కాంగ్రెస్ ఫై నమ్మకం తక్కువగా ఉంది - టీడీపి

దిగ్విజయ్ సింగ్ మాటలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నా కాంగ్రెస్‌పై నమ్మకం తక్కువగా ఉందని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ పార్టీకి ఒకో ఇన్‌ఛార్జి వచ్చినప్పుడల్లా ఒకో మాట మాట్లాడుతున్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు నెలలో తెలంగాణ సంగతి తేలుస్తామని షిండే అన్నారు. నెలంటే నెల కాదని తర్వాత చెప్పారు. ఇప్పుడు దిగ్విజయ్ పది రోజులు అంటున్నారు. తర్వాత ఏమంటారో తెలియదు.

పంచాయతీ ఎన్నికల కోసం ఆ పార్టీ డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇవ్వదల్చుకొంటే ఎవరు ఆపారు? అక్కడ ఒక మాట...ఇక్కడ ఒక మాట. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను మాత్రమే తెలంగాణ ప్రజలు కోరుకొంటున్నారు. కెసిఆర్, కాంగ్రెస్ పార్టీ చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోవడం ముఖ్యం తప్ప మిగిలినవి కాదు. పార్లమెంటులో బిల్లు పెడితే మేం మద్దతు ఇస్తాం. అసెంబ్లీలో పెట్టినా మా మద్దతు ఉంటుంది' అని ఆయన అన్నారు. దిగ్విజయ్ మాటల్లో లోతు ఉంది... తమ పార్టీ...జగన్ పార్టీ డిఎన్ఎ ఒకటేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్లో లోతు ఉందని మోత్కుపల్లి అన్నారు.

Tags: Telugu News, Andhra News, News

తెలంగాణా ఫై నిర్ణయం ఏదైనా కట్టుబడి ఉండాలి - దిగ్విజయసింగ్

 ప్రత్యేక తెలంగాణ సమస్యపై నిర్ణయం ఏదైనా ఇరు ప్రాంతాల నేతలు కట్టుబడి ఉండాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలించిన దిగ్విజయ్ సింగ్ మంగళవారం కర్నాటకలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై మరింత స్పష్టత ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ సమస్య ఉందని, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రంలో తమ విజయావకాశాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. తమ దృష్టి అంతా దక్షిణాది రాష్ట్రాల పైనే ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో యాభై సీట్లు గెలువాలనేది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌ల పైననే తమ దృష్టి ఉందని చెప్పారు. తమ ఆశలు కూడా దక్షిణాది పైనే ఉన్నాయన్నారు. కర్నాటక లోకసభ ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
కేరళలోను తమకు అనుకూలంగా ఉందన్నారు. తమిళనాడులో పొత్తులకు ఇంకా సమయం ఉందని చెప్పారు. తెలంగాణ విషయంలో రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పానని, ఒకటి విభజన, రెండు సమైక్యాంధ్ర అన్నారు. రాష్ట్ర విభజన, సమైక్యంపై రోడ్‌మ్యాప్ తయారు చేసి నివేదిక ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ను కోరామని తెలిపారు. ఆ నివేదికను అధిష్టానానికి ఇస్తామని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలని దిగ్విజయ్‌సింగ్ చెప్పారు.

Tags: Telugu News, Andhra News, News

Aamir Khan’s future daughter-in-law!

Do’nt get shocked with this news? Well, you know Aamir Khan’s son Junaid Khan is a big boy now, and yes, he is having a girlfriend too. And, if reports are to be believed, the couple is very serious about their relationship. Junaid Khan, son of Aamir and his ex-wife Reena, is having an affair with a girl named Sonam Verma. As per media reports, Sonam Varma is a student of post graduation from Welingkar Institute of Management Development and Research. Sources informed a leading daily that Junaid met Sonam, almost a year back, and they have been dating each other ever since. Reports further say that Junaid has already introduced his pretty girlfriend to papa Aamir Khan. And now, it would be interesting to see how far does this relationship go? Though it is too early to decide, but wonder if Sonam is Aamir’s future daughter-in-law! Junaid, who just 18-years-old, has taken up filmmaking, unlike his actor father Aamir. As per the reports, the Khan Junior is currently busy assisting director Rajkumar Hirani on his upcoming film, Peekay. Peekay will feature Aamir Khan and Anushka Sharma in the leads. If things go really well, we hope to see Junaid making good films in future.
Rate this post

Sunday, 30 June 2013

ఇంగ్లాండ్ వెళ్లనున్న కాజల్ !

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తాను నటిస్తున్న రెండు ద్విభాషా సినిమాల షూటింగ్ల నడుమ బిజీగా వుంది. ‘ఆల్ ఇన్ అజాఘు రాజ’ మరియు ‘జిల్లా’ సినిమాలలో ఆమె కనిపించనుంది. ‘జిల్లా’ సినిమాలో ఆమె విజయ్ సరసన కనిపిస్తుండగా, మరో సినిమాలో కార్తి సరసన నటిస్తిస్తుంది. ప్రస్తుతం కార్తి సినిమాలో ఒక పాటలో పాల్గున్న ఆమె తన సినిమాపై ఎంతో ఉత్సాహంగా వుంది. వీరిద్దరు ఇప్పటికే ‘నా పేరు శివ’ సినిమాలో కలిసి నటించారు.ప్రస్థుథమ్ కాజల్ కుటుంబం ఇంగ్లాండ్ లో సెలవులకు వెళ్ళారు. త్వరలో ఆమె కూడా వారితో కలవనుందని తెలిపింది. వింబుల్డన్ లో నా కుటుంబం అక్కడ పసందైన రుచులను ఆస్వాదిస్తున్నారు, వారిని వదిలి ఉండలేకపోతున్నాను” అని తన అధికారికి పేజిలో తెలిపింది. ‘బాద్ షా’ తరువాత తెలుగులో మరో సినిమా అంగీకరించడానికి చాలా ఆలోచనలు చేస్తుంది. కొన్ని పెద్ద ప్రాజెక్ట్లు ఆమెను ఇప్పటికే పలకరించాయి.

Tags: Film News, Telugu Cinema News

తెలంగాణ రాజధానిగా హైదరాబాద్: డీఎస్ !

తెలంగాణలోని ప్రతి పల్లె నుంచి తెలంగాణ సాధన సభకు ప్రజలు తరలిరావడం సంతోషంగా ఉందని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ నేతల ఐక్యత వల్ల ప్రజల్లో ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో తప్ప మిగతా పార్టీలతో తెలంగాణ రాదన్న నిజం ప్రజలకు తెలుసని అన్నారు. సోనియాతోనే తెలంగాణ సాధ్యమని పార్టీ కదిలిందన్నారు.

రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకే ఆలస్యం జరుగుతోందని వెల్లడించారు. తొందరలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉంటుందన్నారు.

Tags: Telugu News, Andhra News, News

సక్సస్ తో దూసుకెళుతున్న శ్రుతి హాసన్ !

మొదట్లో అన్ని ఇండస్ట్రీల్లో పరజయాల్ని అందుకున్న శృతి హాసన్ ‘గబ్బర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బాగా బిజీ అయిపొయింది. తాజాగా శ్రుతి హాసన్ రవితేజ సరసన నటించిన ‘బలుపు’ సినిమా విడుదలై హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచిన ఈ భామ తన రాబోయే హిందీ ‘డి-డే’ సినిమాలో వేశ్య పాత్రలో శృతి మించి అందాలు ఆరబోసిందని అంటున్నారు. దానికి సంబందించిన కొన్ని ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఇదే విషయాన్ని ఆమె ముందు ప్రస్తావిస్తే ‘ వేశ్య పాత్రని ఒక సవాల్ గా తీసుకున్నా అందుకే ఆ సినిమా చేసాను. సినిమా పోస్టర్ ని చెడుగా చూస్తే చెడుగా అనిపిస్తుంది, అదే కళాత్మక దృష్టితో చూస్తే అసభ్యంగా కనపడదు. చూసే వారి దృష్టిని బట్టి అది ఉంటుంది. నేను ఈ సినిమాలో చేసింది బోల్డ్ రోల్, అది నేను కాదనను. కానీ సినిమాలో ఆపాత్రని చూస్తే కచ్చితంగా నచ్చుతుంది. నాకు తెలిసి ఇలాంటి పాత్ర ఎవరికీ వచ్చినా చేస్తారని’ శృతి సమాధానం ఇచ్చింది.

Tags: Telugu News, Andhra News, News,

జానాపై చెప్పు విసిరేందుకు ప్రయత్నించిన యువకుడు !

తెలంగాణ సాధన సభలో మంత్రి జానారెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఓ యువకుడు చెప్పు విసిరేందుకు ప్రయత్నం చేశాడు. యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ సాధన సభలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.


Tags: Telugu News, Andhra News, News

తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తాం : జానా రెడ్డి !

ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాడిన తర్వాత విచక్షణకు గురైందని, ఒప్పందాల ఉల్లంఘన జరిగిందని సంఘాలు, సంస్థలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాల్ని చేపట్టాయని రాష్ట్రమంత్రి జానారెడ్డి అన్నారు. నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన ‘తెలంగాణ సాధన సభ’లో జానారెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరులకు జోహార్లు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం గత 57 సంవత్సరాల నుంచి జరుగుతోంది అని జానా అన్నారు. 1956 నుంచి కొండా వెంకట రంగారెడ్డి, చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డిలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేశారన్నారు. శాసన మండలి, శాసన సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని జానా అన్నారు. 

తెలంగాణ కోసం పార్టీ అధిష్టానాన్ని ఎదరించిడానికి కూడా వెనుకాడలేదని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, కుటుంబం లాంటి పార్టీతో తన సన్నిహితులు విభేధించారని జానా తెలిపారు. ప్రజల ఆకాంక్ష, నాయకుల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త్వరలో జరుగుతుందని ఆయన విశ్వాసం ప్రకటించారు. 

పది జిల్లాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చే రోజు తొందర్లోనే ఉందని, అనేక రాష్ట్రాలను ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని.. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటుందని జానా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుస్థిరతకు మారుపేరుగా నిలుస్తుందని, దేశంలోనే ఓ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని జానా ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఆత్మహత్యలు, బలిదానాలు చేసుకోవద్దని.. యువత నిస్పృహకు లోనుకావోద్దని.. త్వరలోనే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందనే హామీని జానా ఇచ్చారు. ఈ సభ ఏర్పాటు రాజకీయ లబ్దికోసం కాదని.. తెలంగాణ సాధన కోసమేనని జానా తెలిపారు. తెలంగాణ కోసం పదవుల త్యాగానికైనా సిద్ధం అని.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీట్లు ఎవరికిచ్చినా గెలిపిస్తాం అని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాటం కొనసాగిస్తునే ఉంటామన్నారు.

Tags: Telugu News, Andhra News, News