ప్రత్యేక తెలంగాణ సమస్యపై నిర్ణయం ఏదైనా ఇరు ప్రాంతాల నేతలు కట్టుబడి ఉండాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలించిన దిగ్విజయ్ సింగ్ మంగళవారం కర్నాటకలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై మరింత స్పష్టత ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ సమస్య ఉందని, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రంలో తమ విజయావకాశాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. తమ దృష్టి అంతా దక్షిణాది రాష్ట్రాల పైనే ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో యాభై సీట్లు గెలువాలనేది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌ల పైననే తమ దృష్టి ఉందని చెప్పారు. తమ ఆశలు కూడా దక్షిణాది పైనే ఉన్నాయన్నారు. కర్నాటక లోకసభ ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
కేరళలోను తమకు అనుకూలంగా ఉందన్నారు. తమిళనాడులో పొత్తులకు ఇంకా సమయం ఉందని చెప్పారు. తెలంగాణ విషయంలో రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పానని, ఒకటి విభజన, రెండు సమైక్యాంధ్ర అన్నారు. రాష్ట్ర విభజన, సమైక్యంపై రోడ్‌మ్యాప్ తయారు చేసి నివేదిక ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ను కోరామని తెలిపారు. ఆ నివేదికను అధిష్టానానికి ఇస్తామని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలని దిగ్విజయ్‌సింగ్ చెప్పారు.
Tags: Telugu News, Andhra News, News

No comments:
Post a Comment