Latest Navel Updates

Monday 17 June 2013

ఎట్టకేలకు మంత్రి పదవి దక్కించు కున్న కావూరి !

Kavuri Sambasiva Rao


ఎట్టకేలకు మంత్రి  పదవి దక్కించుకున్న కావూరి !

 ఆంధ్ర సమైక్య వాదిగా నిలిచిన MP కావూరి సాంబశివరావు కు కాబినెట్ హోదాలో జావళి శాఖా మంత్రి పదవి దక్కింది . అయన గత కొద్ది కాలంగా కాంగ్రెస్ అధిష్టానం మీద అలిగి, పార్టికి కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు . 
3 దశాబ్దాల కు ఫైగా పార్టీలో ఉన్న తనకు తగిన గుర్తింపు రాలేదని , త్వరలో తన రాజకీయ భవిషత్ వెల్లడి చేస్తాన్నని ప్రకటన కూడా చేసారు . ఆ తరువాత స్వయంగా ప్రధాని మన్మోహన్ , మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు నచ్చ చెప్పిన మీదట పార్టీ ని వీడకుండా మౌనంగా ఉండిపోయారు . రాష్ట్రం తరపున కేంద్రంలో గట్టిగా సమైఖ్య వాదం వినిపించిన వారిలో కావూరి ముఖ్యుడు . జౌళిశాఖ సాధారణ ప్రజానీకంతో ముడిపడి ఉంది అని, జౌళిశాఖకు ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసేందుకు, గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తా అని కావూరి అన్నారు. రాష్ట్ర చేనేత కార్మికుల ఆత్మహత్యల నిరోధానికి, పత్తిరైతుల సమస్యలు పరిష్కరిస్తానని కావూరి స్పష్టం చేశారు. 


Tags: News, AP News, Andhra News, Telugu News  

No comments:

Post a Comment