Latest Navel Updates

Monday 17 June 2013

విశ్వరూపం-2 తర్వాత కమల్ మర్మయోగి !

Kamal Hassan in Marmayogi


విశ్వరూపం-2 తర్వాత కమల్ మర్మయోగి !


కమల్‌ హాసన్‌ ఎప్పటినుంచో కలగంటున్న 'మర్మయోగి' చిత్రం మళ్ళీ చర్చకు వచ్చింది. ఇప్పటివరకు విశ్వరూపం సక్సెస్‌ తర్వాత సీక్వెల్‌ పనిలో ఉన్న కమల్‌కు ఒక్కసారిగా మర్మయోగి పూర్తిచేయాలనే ఆలోచన వచ్చినట్లు కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌ సినిమా కనుక ఆ చిత్రాన్ని ఓ సంస్థ చేయడానికి ముందుకువచ్చింది. 


కానీ షూటింగ్‌ జరుగుతుండగా.. కాంబినేషన్‌ సంస్థ రాజ్‌ గ్రూప్‌ తప్పుకుంది. దీనికి కారణం.. 7వ శతాబ్దం నాటి పరిస్థితులకు అనుగుణంగా పాత్రలు, సెట్లు వేయాలంటే.. మామూలు విషయం కాదు.. తడిసి మోపెడు అవుతుంది. ఇందులో వెంకటేష్‌ కూడా ఓ పాత్ర చేయనున్నాడు. 

ఇంకా పలువురు హీరోయిన్లు కూడా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ చేస్తే హాలీవుడ్‌ స్థాయిలో సౌత్‌ ఇండియన్ సినిమా పేరు మారుమోగిపోతుందని కమల్‌ అంటున్నాడు. కానీ.. ఈ చిత్రాన్ని తీసేందుకు ఎవరైనా ముందుకు వస్తే బాగుండునని సన్నిహితులతో అన్నట్లు సమాచారం. అన్ని ప్రయోగాలతో ముందుకు వచ్చే కమల్‌ కోసం ఎవరు ముందుకు వస్తారో చూడాలి.

Tags: Telugu Cinema News, Telugu Movie News, Tollywood

No comments:

Post a Comment