Latest Navel Updates

Wednesday, 26 June 2013

శంకరన్నకు తప్పని తిప్పలు !

మాజీ మంత్రి కంటోన్ మెంట్ శాసన సభ్యుడు శంకర్ రావు  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి డి. జి. పి. దినేష్ రెడ్డి లపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోర్ట్‌లో పిటిషన్ దాఖలు అయింది. కోర్ట్ ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావాలని సైఫబాద్ పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే రెండు సార్లు ఆయన పోలీసుల ఎదుట హాజరు కాలేదు. దాంతో సీరియస్ అయిన పోలీసులు బుదవారం విచారణకు హాజరు కానీ పక్షంలో అరెస్ట్ వారెంట్ జారీచేయక తప్పదని హెచ్చరించారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసుల ఎదుట హాజరయిన శంకర్ రావు నలుపు దుస్తులను  పోలీసుల ఎదుట హాజరు కావడం విశేషం.

Tags: News, Telugu News, Andhra News

No comments:

Post a Comment