Latest Navel Updates

Friday, 21 June 2013

సబితకు కోర్టు ఊరట!

సబితకు కోర్టు ఊరట! 

జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా, దాల్మియా సిమెంట్స్ భూ కేటాయింపుల్లో మాజీ హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫై సిబిఐ కోర్టు విచారణ జరుపుతోంది . ఇందులో భాగంగా శుక్రవారం సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి లోని సిబిఐ కోర్టుకి హాజరుఅయ్యారు.  ఇదే కేసులో దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియా, ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా కోర్టుకు వచ్చారు. సబిత, ధర్మాన ప్రసాదరావును జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలని కోరుతూ సీబీఐ మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సబిత కోర్టుకు పూచీకత్తు సమర్పించారు. వీటిని కోర్టు ఆమోదించింది.అంతమాత్రాన సబితకు స్వేచ్ఛ కల్పించినట్లుగా సీబీఐ భావించరాదని కోర్టు పేర్కొంది. దీంతో సబిత ప్రస్తుతానికి జైలు వాసం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

Tags: News, Telugu News, AP News

No comments:

Post a Comment