Latest Navel Updates

Wednesday 12 June 2013

జులై లో నాగ చైతన్య 'హలోబ్రదర్' రెగ్యులర్ షూటింగ్ !



జులై లో నాగ చైతన్య 'హలోబ్రదర్' రెగ్యులర్ షూటింగ్ !


నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రం 'హలో బ్రదర్'. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. కామాక్షి మూవీస్ నిర్మిస్తోంది. డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల్లో మొదలవుతుంది. నిర్మాత మాట్లాడుతూ "నాగార్జున 'హలో బ్రదర్' పాయింట్ తీసుకుని ప్రజంట్ ట్రెండ్‌కి అనుగుణంగా నిర్మిస్తున్న ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్ ఇది.
'హలో బ్రదర్' అనగానే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాటికి రీచ్ అయ్యేలా పక్కా స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. జూలై మొదటి వారం నుంచి ఏకధాటిగా చిత్రీకరిస్తాం. ప్రస్తుతం ఈ చిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది'' అని అన్నారు.


Tags: Movie News,Cinema News, Telugu Movie News, Telugu Cinema News

No comments:

Post a Comment